ఉపాధి హామీ కూలీ మృతి ..ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన

ఉపాధి హామీ కూలీ మృతి ..ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన

కూసుమంచి, వెలుగు: ఉపాధి హామీ కూలీ పనులు చేస్తూ ఒకరు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.  తోటి కూలీలు తెలిపిన ప్రకారం.. కూసుమంచి గ్రామానికి చెందిన కొంగర పుల్లయ్య(75), బుధవారం ఉదయం ఉపాధి హామీ పనిలో భాగంగా మండల కేంద్రంలోని గ్లోబల్ స్కూల్ వెనక మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు. ఒక్కసారిగా పుల్లయ్య  స్పృహ తప్పి కిందపడిపోయాడు. తోటి కూలీలు స్థానిక డాక్టర్లకు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.