ఆర్మీ సాహసం : మంచు వర్షంలోనూ ఉగ్రవేట .. ఇద్దరు

ఆర్మీ సాహసం : మంచు వర్షంలోనూ ఉగ్రవేట .. ఇద్దరు

సరిహద్దులో భారత సైన్యం సాహసాలకు ఇదో మచ్చుతునక. జమ్ముకశ్మీర్ లోని బుడ్గామ్ జిల్లాలో ఈ సీజన్ లోనే అత్యంత ఎక్కువ మంచు కురుస్తోంది. ఆదమరిచి ఉంటారనుకున్నారో ఏమో… ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారు. సమాచారం అందుకున్న నిఘా వర్గాలు భద్రతాబలగాలను అప్రమత్తం చేశాయి. జిన్ పాంచల్ కు దగ్గర్లో ఉన్న హపట్ నాలా అనే ప్రాంతాన్ని CRPF, రాష్ట్రీయ రైఫిల్స్, బుడ్గామ్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీస్థాయిలో మంచు కురుస్తున్నా… వెరవకుండా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతం చుట్టూ బలగాలను మోహరించారు. తమ పని ఖతం అని తెలిసిపోవడంతో… ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అలర్ట్ గా ఉన్న  భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ పైరింగ్ లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు.  ప్రతికూల వాతావరణం ఉన్నా… ఈ ఆపరేషన్ ను ఆర్మీ కొనసాగిస్తోంది. ఉగ్రవేట కొనసాగిస్తోంది.

ఎముకలు కొరికే మంచులో సైన్యం చేసే సాహసాలకు, ఆపరేషన్లకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. సియాచిన్ లాంటి సరిహద్దులో కొన్ని నెలలపాటు.. మంచులో కూరుకుపోయి కూడా గస్తీ కాస్తుంటుంది మన సైన్యం.