తాడ్వాయి, వెలుగు : మండలంలోని ఎండ్రియాల్ గ్రామానికి చెందిన బదనకంటి గంగయ్య సర్పంచ్‌గా నామినేషన్ వేసేందుకు తన జీవనాధారమైన మేకలను అమ్మాడు. ప్రజా సేవ చేయాలన్న సంకల్పంతో బరిలో నిలువాలని మేకలను అమ్మినట్లు తెలిపాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు చాకలి భాగ్య, చాకలి కిష్టయ్య, సంతాజి గారి సుధాకర్ రావు తదితరులు విరాళాలు ఇచ్చి అండగా నిలిచారు. మంగళవారం గ్రామంలో ప్రచారం సైతం నిర్వహించారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, సుధాకర్ రావు, సాయికుమార్, దశరథ్, భాగ్య, కిష్టయ్య, సంజీవులు తదితరులుపాల్గొన్నారు
