ల్యూమినస్ ​సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ షురూ

ల్యూమినస్ ​సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ షురూ

హైదరాబాద్, వెలుగు​: ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ ల్యూమినస్​ పవర్ టెక్నాలజీస్, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని రుద్రాపూర్‌‌‌‌‌‌‌‌లో మొదటి సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీని ప్రారంభించింది.   ల్యూమినస్​ పవర్ టెక్నాలజీస్ సీఈఓ ప్రీతి బజాజ్,  ల్యూమినస్​ బోర్డ్ ఛైర్మన్ - మనీష్ పంత్‌‌‌‌‌‌‌‌లతోపాటు లెజెండరీ క్రికెటర్  ల్యూమినస్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో అతిపెద్దది అయిన ఈ సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.   

ఆటోమేటెడ్  సరికొత్త  అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ టెక్నాలజీలు దీని సొంతం. 250 మెగావాట్లతో మొదలైన ఈ అత్యాధునిక ప్లాంట్  సామర్థ్యంతో 1 గిగావాట్​ వరకు విస్తరించింది.  ఈ ప్లాంట్ పాలీక్రిస్టలైన్, మోనోక్రిస్టలైన్, ఎన్​-టైప్ టాప్‌‌‌‌‌‌‌‌కాన్,  హెటెరోజంక్షన్ ప్యానెల్‌‌‌‌‌‌‌‌లను, మోనోఫేషియల్  బైఫేషియల్ ఇన్‌‌‌‌‌‌‌‌సెంట్స్​ను తయారు చేస్తుందని ల్యూమినస్​ ఈ సందర్భంగా ప్రకటించింది.