ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగుతున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగుతున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులు వరుసగా బయటపడుతున్నాయి. ఈడీ స్పెషల్ టీమ్స్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వ్యాపారవేత్త శ్రీనివాసరావును ఇవాళ ఈడీ విచారించింది. అతనికి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉండటంతో పాటు.. రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ ప్రేమ్ సాగర్ రావుకు.. శ్రీనివాసరావు దగ్గరి బంధువు అని తెలుస్తోంది. CBI నమోదు చేసిన కేసు ఆధారంగా..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్, హైదరాబాద్ లింకులపై ఆరా తీస్తుంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.

 ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ వరుస తనిఖీలు చేస్తూ.. లిక్కర్ లింకులపై కూపీ లాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని ఇప్పటికే విచారించింది ఈడీ. ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని.. వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో  మూడుగంటలు సోదాలు చేశారు ఈడీ అధికారులు. తర్వాత శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీస్ కు తరలించి.. అక్కడ కూడా విచారించారు. 

 లిక్కర్ లింకులు, మనీలాండరింగ్ పై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శ్రీనివాసరావు పేరుపై పదుల సంఖ్యలో కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. వాటి కార్యకలాపాలు, ఆదాయ మార్గాలపై క్వశ్చన్ చేసినట్లు సమాచారం. శ్రీనివాసరావు స్టేట్ మెంట్ ఆధారంగా పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చి.. విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ముఖ్యనేతలతో శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. CBI నమోదు చేసిన కేసు ఆధారంగా..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్, హైదరాబాద్ లింకులపై దర్యాప్తు చేస్తోంది.

బంజారాహిల్స్ తో పాటు రామంతాపూర్ లోని సాలిగ్రామ్ సంస్థ..మాదాపూర్ లోని వర్సన్ సంస్థలో కూడా రైడ్స్ జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో CBI నమోదు చేసిన కేసులో.. రాబిన్ డిస్టిలరీ  డైరెక్టర్ రామచంద్ర పిళ్లై కీలక నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే రామచంద్ర పిళ్లైని క్వశ్చన్ చేసింది ఈడీ. అయితే పిళ్లైతో పాటు బోయిన్ పల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ రావు రాబిన్ డిస్టిలరీ  డైరెక్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈడీ విచారిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావు.. రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ గండ్ర ప్రేమ్ సాగర్ రావుకు దగ్గరి బంధువుగా తెలుస్తోంది.