ఈడీ క‌స్ట‌డీకి న‌వాబ్ మాలిక్

ఈడీ క‌స్ట‌డీకి న‌వాబ్ మాలిక్

మనీలాండరింగ్ కేసులో ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ క‌స్ట‌డీకి కోరింది. మంత్రిని 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఇవాళ న‌వాబ్ మాలిక్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌ను అరెస్ట్ చేశారు. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణకు సంబంధించి బుదవారం ఉదయం 6 గంటలకు నవాబ్ మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఓ గంట సేపు ప్రశ్నించిన అనంతరం 7:30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో నవాబ్ మాలిక్ ఈడీకి సహకరించలేదని సమాచారం.

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌తో పాటు పరారీలో ఉన్న ఉగ్రవాద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్, ఇతరులపై నమోదైన కేసులో ఈడీ ముందు హాజరు కావాలని నవాబ్ మాలిక్‌కు ఇదివరకే సమన్లు జారీ అయ్యాయని సమాచారం. ఈ విషయమై గత వారం ఈడీ వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈడీ  దాడుల ఆధారంగా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. మ‌రోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నవాబ్ మాలిక్‌ను ఈ విధంగా టార్గెట్ చేశార‌ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండిః

ప్రియాంక గాంధీకి బీజేపీ కార్య‌క‌ర్త షేక్ హ్యాండ్

భారీ భద్రత మధ్య ఓటేసిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా