భారీ భద్రత మధ్య ఓటేసిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

భారీ భద్రత మధ్య ఓటేసిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన అశిశ్ మిశ్రా తండ్రి, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా భారీ భద్రత నడుమ ఓటు వేశారు. నిఘాసన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భన్వారీపూర్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు, పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఆయన పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో, బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కుమారుడు ఆశిశ్ మిశ్రా గురించి రిపోర్టర్లు అజయ్ మిశ్రాను ప్రశ్నించగా.. విక్టరీ సింబల్ చూపుతూ వెళ్లిపోయారు. 

గతేడాది అక్టోబర్లో లఖింపూర్ ఖేరీలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఘటనలో ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులతో పాటు మరో ఇద్దరు చనిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులు అక్టోబర్ 9న ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న ఆయనకు తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆశిశ్ మిశ్రా బెయిల్పై బయటకు రావడంపై లఖింపూర్వాసులు ఆగ్రహంతో ఉన్నారు. బెయిల్ రద్దుచేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే దీక్షలు

పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు