పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆఫ్లైన్ పరీక్షలు రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఎస్ఈ, ఐఎఎస్ఈతో పాటు ఇతర బోర్డ్ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్లు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడంతో పాటు వారిలో తప్పుడు ఆశలు కల్పిస్తాయని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటివి సంప్రదాయంగా మారకూడదని సూచించింది. అధికారులు ఇప్పటికే పరీక్షల తేదీలు ప్రకటించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారన్న ధర్మాసనం.. ఎగ్జామ్ డేట్స్ తో ఇబ్బందులుంటే వారిని సంప్రదించవచ్చని సూచించింది. 

అన్ని రాష్ట్ర బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఓపెన్ స్కూలింగ్ ద్వారా నిర్వహించే 10, 12  తరగతుల ఆఫ్లైన్ పరీక్షలు రద్దు చేయాలంటూ 15 రాష్ట్రాల విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆఫ్లైన్ పరీక్షల బదులు ప్రత్యామ్నాయ విధానంలో అసెస్మెంట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ కొట్టి వేసింది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా పలు రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులు 10,12వ తరగతి పరీక్షలు రద్దు చేశాయి. ఈ ఏడాది వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పరీక్షల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీబీఎస్ఈ ఈ ఏడాది నుంచి సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 10, 12వ క్లాస్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది.

For more news...

ఒమిక్రాన్ సైలెంట్ కిల్ల‌ర్

నదికి నడక నేర్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్