
బ్రిటన్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో వెనకబడి ఉన్న టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టెస్ట్‌కు ముందు ఆటగాళ్లు వరుసగా గాయపడటం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే నెట్ ప్రాక్టీసులో గాయపడి బౌలర్ అర్షదీప్ సింగ్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా టీములోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగానే.. మరో స్టార్ బౌలర్ ఆకాష్ దీప్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆకాష్ దీప్ గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నట్లు జాతీయ వార్త సంస్థ పీటీఐ నివేదించింది.
నాలుగో టెస్టుకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆ లోపు ఆకాష్ దీప్ కోలుకోకపోతే అతడు నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బుమ్రా స్థానంలో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బరిలోకి దిగిన ఆకాష్ దీప్ దుమ్మురేపాడు. రెండు ఇన్సింగ్స్‌ల్లో కలిపి ఏకంగా పది వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మాత్రం అంచనాల మేర రాణించలేదు. రెండు ఇన్సింగ్స్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టి నిరాశపర్చాడు. గిల్ సేనకు డూ ఆర్ డై లాంటి నాలుగో టెస్టుకు ముందు ఆకాష్ దీప్ గాయపడటం జట్టు బౌలింగ్ కూర్పు ఇబ్బందిగా మారింది.
కాగా, ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లురుతున్నాయి.