డిప్లొమా, బీటెక్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి..

డిప్లొమా, బీటెక్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్ సీ) అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్, ట్రైనింగ్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు యూపీఎస్ సీ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 29. 

  • పోస్టులు: 84 (అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్, ట్రైనింగ్ ఆఫీసర్)
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడులో బి.ఆర్కిటెక్చర్, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్​​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 35 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 55 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: మే 10.
  • లాస్ట్ డేట్: మే 29. 
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. ఇతర అభ్యర్థులకు రూ.25.
  • సెలెక్షన్ ప్రాసెస్: సంబంధిత ట్రేడులో విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అన్ రిజర్వ్​డ్/ఈడబ్ల్యూఎస్ 50 మార్కులు, ఓబీసీ 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు upsconline.gov.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.

►ALSO READ | సీఎస్ఐఆర్ సీఈఈఆర్ఐలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ