ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
  • పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు సమీపంలోని వాటర్ ఫాల్స్ వద్ద చెక్ డ్యామ్ లో ఘటన
  • ఇదే చెక్ డ్యామ్ లో నెల రోజుల క్రితం ఒకరు.. ఇప్పుడు ఇంకొకరు

హైదరాబాద్: చెక్ డ్యామ్ లో నీటిని చూసి పరవశించి ఈతకు దిగిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. డేంజర్ వాటర్ ఫాల్స్ గా బోర్డులు పెట్టినా గమనించాడో లేదో కానీ.. నీటిలో ఈతకు దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పెద్దఅంబర్ పెట్ ఔటర్ రింగ్గురోడ్డు వద్ద వాటర్ ఫాల్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన విషాదం రేపింది. మృతుడు హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి అప్రోజ్ హైమద్ గా గుర్తించారు. 

నెల రోజుల క్రితం ఈ చెక్ డ్యామ్ లో ఒకరు మృతి చెందడంతో డేంజర్ ఫాల్స్ గా పోలీసులు బోర్డు పెట్టారు. వాటిని గమనించాడో లేదో కానీ ఈత కోసం నీళ్లలో దిగి బయటపడలేక మునిగి చనిపోయాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి ప్రమాదాన్ని హెచ్చరించే బోర్డులు ఉన్నా గుర్తించకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం చూసిన వారందర్నీ కంటతడిపెట్టించింది.