IND vs ENG: టీమిండియాను దెబ్బ కొట్టడానికి దిగ్గజ బౌలర్‌ను సంప్రదించిన ఇంగ్లాండ్ క్రికెట్

IND vs ENG: టీమిండియాను దెబ్బ కొట్టడానికి దిగ్గజ బౌలర్‌ను సంప్రదించిన ఇంగ్లాండ్ క్రికెట్

టీమిండియాతో జరగనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు భారత జట్టు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉంటే.. మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటి నుంచే సేరీడ్స్ ఎలా గెలవాలనే వ్యహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఒక దిగ్గజ బౌలర్ ను రంగంలోకి ధింపనున్నట్టు సమాచారం. సొంత గడ్డపై ఇంగ్లాండ్ తమ దేశంలో భారత్ పై ఆధిపత్యం చెలాయించడానికి న్యూజిలాండ్  మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీని బౌలింగ్ కన్సల్టెంట్‌గా పరిశీలిస్తోంది. ఆండర్సన్ స్థానంలో ఈ కివీస్ పేసర్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తుంది. 

2024 లో ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వీడ్కోలు పలికిన వెంటనే  ఇంగ్లాండ్ జట్టు జేమ్స్ ఆండర్సన్‌ను కన్సల్టెంట్ రోల్ కోసం సంప్రదించగా అండర్సన్ అంగీకరించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అండర్సన్.. ఇంగ్లాండ్ డొమెస్టిక్ టోర్నీ లంకాషైర్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడతానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కారణంగానే అండర్సన్ భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ఇంగ్లాండ్ కన్సల్టెంట్‌గా ఉండట్లేదు. 

సౌథీ గత ఏడాది నవంబర్ 15 న  తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2008 లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ళ పాటు కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు. కివీస్ తరపున ఈ కివీస్ పేసర్ 107 టెస్టుల్లో ఆడాడు. 201 ఇన్నింగ్స్ లో 391 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఘనతను 15 సార్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. 

►ALSO READ | IPL 2025: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న RCB ప్లేయర్స్.. శ్రేయంకా పాటిల్ కూడా వచ్చిందే!

భారత్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తో ఇంగ్లాండ్ తమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-2027 సైకిల్‌ను ప్రారంభించనుంది.లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. గత ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి.