
బర్మింగ్‌హామ్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇంగ్లండ్.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 238 రన్స్ భారీ తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ ఓడిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 400/8 స్కోరు చేసింది. జాకబ్ బెథెల్ (82), బెన్ డకెట్ (60), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (58), జో రూట్ (57) హాఫ్ సెంచరీలు చేయగా, విల్ జాక్స్ (39), జెమీ స్మిత్ (37) అండగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 400 స్కోరు చేసినా ఒక్కరు కూడా సెంచరీ చేయకపోవడం విశేషం. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ ఇంత స్కోరు చేయడం ఇది ఆరోసారి. ఇక వన్డే మ్యాచ్ చరిత్రలో ఒక జట్టులోని టాప్–7 బ్యాటర్లు 30కి పైగా రన్స్ చేయడం ఇదే తొలిసారి.
జైడెన్ సీల్స్ 4, అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత విండీస్ 26.2 ఓవర్లలో 162 రన్స్‌కే కుప్పకూలింది. జైడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్. కెప్టెన్ షై హోప్ (25), కేసీ కార్టీ (22) పోరాడి ఫెయిలయ్యారు. సకీబ్ మహ్ముద్, జెమీ ఓవర్టన్ చెరో మూడు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టాడు. వికెట్ కీపర్‌గా కాకుండా ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాంటీ రోడ్స్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును సమం చేశాడు. బెథెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కార్డిఫ్‌లో రెండో వన్డే జరుగుతుంది.