IND vs ENG 2025: ఇంగ్లాండ్‌పై టాస్ ఓడిన టీమిండియా.. ప్రసిద్ స్థానంలో బుమ్రా

IND vs ENG 2025: ఇంగ్లాండ్‌పై టాస్ ఓడిన టీమిండియా.. ప్రసిద్ స్థానంలో బుమ్రా

ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య గురువారం (జూలై 10) మూడో టెస్ట్ ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి రెండు టెస్టులకు దూరమైన ఆర్చర్ జోష్ టంగ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా విషయానికి వస్తే ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ప్రసిద్ కృష్ణ స్థానంలో బుమ్రా ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు.  

భారత్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ALSO READ : ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలిసారి టాప్ 10 లోకి శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్