
టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను అధికారికంగా ప్రకటించింది. గురువారం (జూలై 10) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు ఒక రోజు ముందు ఇంగ్లాండ్ తమ తుది జట్టును వెల్లడించింది. రెండో టెస్టులో ఇంగ్లాండ్ తో బరిలోకి దిగిన జట్టులో ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ కు ఇంగ్లాండ్ తుది జట్టులో చోటు కల్పించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆర్చర్ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
బుధవారం (జూలై 9) ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ప్లేయింగ్ 11 లో 5 గురు బ్యాటర్లు.. ఒక వికెట్ కీపర్.. ఒక ఆల్ రౌండర్.. ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆడనున్నారు. మూడో స్థానంలో పోప్ బ్యాటింగ్ చేస్తాడు. సీనియర్ బ్యాటర్ జో రూట్, యువ సంచలనం హ్యారీ బ్రూక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. కెప్టెన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
సూపర్ ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ఏడో స్థానంలో ఆడతాడు. సీనియర్ బౌలర్ క్రిస్ వోక్స్, ఆర్చర్,బ్రైడాన్ కార్సే ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా షోయబ్ బషీర్ కు తుది జట్టులో స్థానం దక్కింది. యువ బ్యాటర్ బెథెల్‌తో పాటు, సామ్ కుక్, జామీ ఓవర్టన్ లకు రెండో టెస్టులోనూ బెంచ్ కు పరిమితమయ్యారు. గస్ అట్కిన్సన్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. నాలుగో టెస్ట్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
నాలుగేళ్ళ తర్వాత ఆర్చర్ రీ ఎంట్రీ..
ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను 2021 ఫిబ్రవరిలో ఆడాడు. ఆ తర్వాత మోచేయికి శస్త్రచికిత్స చేపించుకొని సుదీర్ఘ ఫార్మాట్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2023 లో జరిగిన యాషెస్ తో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్చర్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో అనుభవం లేని ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆర్చర్ జట్టులోకి వస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ సమస్యలు తీరినట్టే.
JUST IN: Jofra Archer is set to make his return to Test cricket after a gap of more than four years #ENGvIND pic.twitter.com/SPGfUsUHSQ
— ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2025