IND VS ENG 2025: టీమిండియాతో ఘోర ఓటమి.. మూడో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో ఏడుగురు ఫాస్ట్ బౌలర్లు

IND VS ENG 2025: టీమిండియాతో ఘోర ఓటమి.. మూడో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్‌లో ఏడుగురు ఫాస్ట్ బౌలర్లు

టీమిండియాతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో గెలిచి బోణీ కొట్టిన ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో ఘోర పరాజయం ఎదురైంది. లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇండియాపై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత ఆదివారం (జూలై 6) ఎడ్జ్ బాస్టన్ లో ఆతిధ్య జట్టు టీమిండియాపై 336 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. దీంతో మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. లండన్ వేదికగా ప్రతిష్టాత్మక లార్డ్స్ గ్రౌండ్ లో గురువారం (జూలై 10) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది.

ఈ టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. జట్టులో కొత్తగా ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌ను జట్టులోకి చేర్చుకుంది. మిగిలిన జట్టును అలాగే ఉంచింది. అంతకముందు ఉన్న 15 మంది ప్రాబబుల్స్ లో ఎవరినీ తప్పించలేదు. మొత్తం 16 మంది ప్రాబబుల్స్ లో ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా ఏడుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండడం విశేషం. క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్ రూపంలో ఇంగ్లాండ్ దుర్బేధ్యమైన ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది. మూడో టెస్టుకు జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ ఇంగ్లాండ్ జట్టులోకి రావడం దాదాపుగా ఖాయమైంది. 

నాలుగేళ్ల తర్వాత ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. బొటన వేలి గాయం నుంచి కోలుకొని ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మ్యాచ్ ఆడాడు. చెస్టర్-లె-స్ట్రీట్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ లో భాగంగా డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ తరపున ఈ స్పీడ్‌స్టర్ 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మే 2021 తర్వాత ఆర్చర్ తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడడం విశేషం. సర్రేకు ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌ను జట్టులోకి చేర్చుకుంది. మే నెలలో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జింబాబ్వేపై ఇంగ్లాండ్ విజయం సాధించిన తర్వాత 27 ఏళ్ల అట్కిన్సన్ గాయపడ్డాడు. ప్రస్తుతం 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. 

టీమిండియాతో మూడో టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు

బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, సామ్ కుక్.
 

ALSO READ : జియోస్టార్‌ CEOకు అతి పెద్ద బాధ్యతలు: ఐసీసీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సంజోగ్ గుప్తా