వరల్డ్ కప్ కి ఇంగ్లాండ్ జట్టు.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్

వరల్డ్ కప్ కి ఇంగ్లాండ్ జట్టు.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్

భారత్ లో జరగబోయే వరల్డ్ కప్ కి ఇంగ్లాండ్ జట్టుని అధికారికంగా ప్రకటించేశారు. 15 మందితో కూడిన ఈ  స్క్వాడ్ లో స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ కి చోటు దక్కలేదు. రాయ్ స్థానంలో యువ ఆటగాడు బ్రూక్స్ కి చోటు దక్కడం గమనార్హం. గత నెలలో ఇంగ్లాండ్ ప్రకటించిన 18 మంది ప్రిలిమినరీ స్క్వాడ్ లో చోటు సంపాదించిన రాయ్..వన్డేలు ఆడక చాల నెలలు గడిచిపోయింది. అదే సమయంలో బ్రూక్ అద్భుతంగా రాణిస్తుండడంతో రాయ్ పై వేటు తప్పలేదు.

మార్క్ వుడ్ ఇన్, ఆర్చర్ ఔట్

ఈ ఒక్కటి మినహాయిస్తే ఇంగ్లాండ్ జట్టులో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ఇండియన్ పిచ్ లను దృష్టిలో ఉంచుకొని  స్పిన్నర్ రషీద్ పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఇక యాషెస్ లో గాయం కారణంగా ఇంగ్లాండ్ జట్టుకి దూరమైన మార్క్ వుడ్ స్క్వాడ్ లో చోటు సంపాదించాడు. 2019 లో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఆర్చర్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. "అత్యుత్తమ జట్టుని సెలక్ట్ చేసాం. భారత్ లో జరిగే వరల్డ్ కప్ కి ఆత్మ విశ్వాసంతో వెళ్తాము" అని సెలక్టర్ ల్యూక్ రైట్ తెలిపాడు.

ALSO READ: సిరాజ్ కు హైదరాబాద్ సలాం.. ప్రముఖుల అభినందనలు

కివీస్ తో తొలి మ్యాచ్

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ జరగనుంది. అదే రోజు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ తో తలపడుతుంది. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ జట్టుతో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ లో ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.