సిరాజ్ కు హైదరాబాద్ సలాం.. ప్రముఖుల అభినందనలు

సిరాజ్ కు హైదరాబాద్ సలాం.. ప్రముఖుల అభినందనలు

ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ నిప్పులు చెరిగాడు. గంటలోనే లంక జట్టును కూల్చేశాడు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఆరు వికెట్ తీసి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ హైదరాబాదీ కుర్రాడిపై ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు సిరాజ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ లిస్టులో టాలీవుడ్ సీనియర్ హీరో నితిన్,మహిళల మాజీ  క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్,తెలంగాణా ఐపీఎస్ ఆఫీసర్ CV ఆనంద్, మంత్రి హరీష్ రావు ఉన్నారు 

మిథాలీ రాజ్:
సంచలన స్పెల్ వేసిన సిరాజ్ నీకు శుభాకాక్షలు. శ్రీలంకకు ఓడించి 8 వ సారి టైటిల్ గెలుచుకున్న టీమిండియాకు నా మనస్పూర్తి అభినందనలు. 

హరీష్ రావు 
సిరాజ్ నువ్వు అద్భుతంగా బౌలింగ్ వేశావు. టీమిండియాను గెలిపించినందుకు నీకు కృతజ్ఞతలు. నీ భవిష్యత్తు బాగుండాలి.

CV ఆనంద్
సిరాజ్ నీ బౌలింగ్ కి నేను ఫిదా అయిపోయాను. టీమిండియాకు నువ్వు మరిన్ని విజయాలు అందించాలి.

నితిన్
సంచలన బౌలింగ్ తో భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించావు. టోర్నీ అంతటా రాణించిన టీమిండియాకు నా అభినందనలు.