మైఖేల్ జర్నీ ఎంజాయ్ చేశా : సందీప్ కిషన్

మైఖేల్  జర్నీ ఎంజాయ్ చేశా : సందీప్ కిషన్

పదమూడేళ్ల కెరీర్‌‌‌‌లో ఫస్ట్ టైమ్ యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపిస్తున్నా అన్నాడు సందీప్ కిషన్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తను నటించిన ‘మైఖేల్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందు కొస్తున్న సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు.

“ఇదొక యూనిక్ స్టోరీ. చాలా వైల్డ్‌‌గా, కొత్త నెరేటివ్ స్టయిల్‌‌లో ఉంటుంది. నేను అగ్రెసివ్‌‌గా కనిపిస్తాను. యాక్షన్ చాలా ఫ్రెష్‌‌గా, రియలిస్టిక్ వైబ్‌‌తో ఉంటుంది. విజువల్‌‌గా ఎక్సయిటింగ్‌‌గానూ ఉంటుంది. ఇందులో ఉన్న సీన్స్ నిజంగా జరిగితే ఎలా ఉంటుందని ఊహించి చేశా. యాక్షన్‌‌తో పాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయి. ఈ సినిమాలో అందరూ బ్యాడ్ గయ్స్. బ్యాడ్ పీపుల్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇందులో డార్క్ కామెడీ ఉంటుంది. ‘మైఖేల్’కి ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. ఎవరితో మాట్లాడడు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌‌కుమార్ జంటగా కనిపిస్తారు. వీళ్లిద్దరి పాత్రలు హైలైట్‌‌. గౌతమ్ మీనన్ క్యారెక్టర్  ఫ్రెష్‌‌గా ఉంటుంది. అలాగే వరుణ్ సందేశ్ కూడా ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ట్రిక్కీగా ఉంటుంది. వీళ్ళంతా కథ, దర్శకుడిపై నమ్మకంతోనే నటించారు. స్ర్కీన్‌‌ప్లే ఊహించిన దానికంటే సర్‌‌‌‌ప్రైజ్‌‌గా ఉంటుంది. నిర్మాతలు భరత్ చౌదరి, పుస్కూరు రామ్మోహన్ రావు సపోర్ట్‌‌తో  ‘మైఖేల్‌‌’ని సక్సెస్ చేయడమే టార్గెట్‌‌గా వర్క్ చేశాం.  ఈ కథకి పాన్ ఇండియా కెపాసిటీ ఉంది. అందుకే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పా. ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేశా. బరువు తగ్గడంతో పాటు స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. ఇక ప్రస్తుతం  భైరవ కోన, బడ్డీ, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చేస్తున్నా. ఈ మూడు డిఫరెంట్ స్టోరీలే. దీనితో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ ఉంది. అలాగే త్వరలోనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్‌‌మెంట్ రాబోతుంది’’.