నా భార్య అందగత్తె కాదా..స్టేజ్ పైనే బరస్ట్ అయిన భర్త..

నా భార్య అందగత్తె కాదా..స్టేజ్ పైనే బరస్ట్ అయిన భర్త..

బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తన భార్య రెండో స్థానంలో వచ్చిందని, ఓ భర్త.. విజేత కిరీటాన్ని నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మిస్ గే మాటో గ్రోస్సో 2023 పోటీకి చెందిన ఈ వీడియోలో.. మోడల్స్ అంతా వేదికపై ఉన్నారు. పోటీకి అడుగు దూరంలో ఇద్దరు ఫైనలిస్టులు ఇమాన్యుయెల్లీ బెలి, కుయాబాలలో.. ఇమాన్యుయెల్లీ బెలిని అనే యువతి పేరును విజేతగా అనౌన్స్ చేస్తారు. గెలుపొందిన యువతిని అభినందిస్తూ మరొక యువతి ఆమెను కౌగిలించుకుంటుంది. ఇంతలోనే ఇదంతా చూస్తోన్న పోటీలో రెండో స్థానంలో నిలిచిన యువతి భర్త.. ఒక్కసారిగా స్టేజి పైకి వస్తాడు. తన భార్య సెకండ్ ప్లేస్ లో రావడం చూసి, కోపోద్రిక్తుడై విజేత చేతిలో ఉన్న కిరీటీన్ని తీసుకుని నేలపై బద్దలు కొడతాడు. ఆ తర్వాత తన భార్యను తీసుకునే వెళ్తూ.. గట్టిగా అరుస్తూ.. మరో సారి కింద పడిన కిరీటాన్ని ముక్కలు చేస్తాడు. అంతలోనే అతన్ని ఆపడానికి స్టేజి పైకి ఓ వ్యక్తి వస్తాడు. అతన్ని తీసుకుని వెళ్తాడు. అతనితో పాటే అతని భార్య కూడా వెంటే వెళ్లిపోతుంది.

ఈ ఇంట్రస్టింగ్ వీడియోకు ఇప్పటివరకు 4లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/brunoguzzo/status/1662809530206412800