మెగా సిటీ వద్దు : ప్రొఫెసర్ హెచ్ఎం దేశర్ద

మెగా సిటీ వద్దు : ప్రొఫెసర్ హెచ్ఎం దేశర్ద

ఖైరతాబాద్, వెలుగు: మెగా సిటీ అంటూ మరో ప్రాజెక్టు తీసుకురావడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ ​హెచ్ఎం దేశర్ద అన్నారు. ప్రెస్​క్లబ్​లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీని రద్దు చేయడం హర్షణీయమన్నారు. మెగా సిటీ ప్రాజెక్టును తీసుకురావడంతో ఫార్మా సిటీ బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మరలకుంట తండావాసులు ఇబ్బందులు పడతారన్నారు. 

గురువారం ఆయా ప్రాంతాల్లో పర్యటించినట్టు ఆయన పేర్కొన్నారు. అక్కడ స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్నాయని, వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారని  చెప్పారు. మళ్లీ మెగా ప్రాజెక్ట్ పేరుతో భూములు తీసుకుంటే తాము ఎక్కడికి వెళ్లిపోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సరస్వతి కవుల, డాక్టర్​ బాబురావు, తంగెల్ల శివప్రసాద్​రెడ్డి పాల్గొన్నారు.