ఆలయానికి వచ్చే భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి : ఈవో రాధాబాయి

 ఆలయానికి వచ్చే భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి : ఈవో రాధాబాయి

వేములవాడ, వెలుగు: రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఆలయ ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలని ఈవో రాధాబాయి సూచించారు. శుక్రవారం రాజన్న ఆలయంలోని ప్రసాదాల తయారీ, అమ్మకాలు, ప్రోటోకాల్ విభాగాలను తనిఖీ చేశారు. ప్రసాదాలను వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, భక్తుల సమాచార కేంద్ర విభాగంలోని రిజిస్టర్ల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రసాద అమ్మకం విభాగంలోని టికెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. 

 మహాలక్ష్మీ అమ్మవారికి మొక్కులు 

శ్రావణమాసం వరలక్ష్మీ శుక్రవారం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మీ ఆమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే క్యూలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేచి ఉండి అమ్మవారికి ఒడి బియ్యం పోసి పిల్లాపాపలు బాగుండాలని వేడుకున్నారు. అమ్మవారికి అర్చకులు షోడశపచార పూజలను నిర్వహించారు. మరోవైపు వేములవాడ రాజరాజేశ్వరదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రాజన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,  అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు 
నిర్వహించారు.