‘వైట్ వాటర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై చీటింగ్ కేసు

‘వైట్ వాటర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’పై చీటింగ్ కేసు

కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సంస్థపై ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫ్లాట్ల విక్రయం పేరుతో కొనుగోలుదారుల నుంచి రూ.270 కోట్లు వసూలు చేసి, సకాలంలో ఫ్లాట్లు అప్పగించకపోవడంతో మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.

మూసాపేట పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన భోగాడి సుజాత ఫ్లాట్ కోసం రూ.80 లక్షలు చెల్లించగా, అదే ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాకట్టు పెట్టి రూ.1.27 కోట్లు తీసుకున్నట్టు ఆమె జనవరి 30న ఈవోడబ్ల్యుకు ఫిర్యాదు చేశారు. సంస్థ దాదాపు 500 మంది కొనుగోలుదారుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసిందని ఆరోపించారు. ఒకే ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇద్దరికి విక్రయించారన్న ఆరోపణలూ ఉన్నాయి.