2030 నాటికి ఈపీసీ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగాలు

2030 నాటికి ఈపీసీ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొక్యూర్​మెంట్, కన్​స్ట్రక్షన్ (ఈపీసీ) రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా 2030 నాటికి 2.5 కోట్లకు పైగా ఉద్యోగాలు వస్తాయని ఒక రిపోర్ట్​ తెలిపింది. సీఐఈఎల్ హెచ్​ఆర్ స్టడీ ప్రకారం, 2020 నుంచి ఈ రంగంలో నియామకాల డిమాండ్ 51 శాతం పెరిగింది. 

ఈపీసీ రంగంలో ప్రస్తుతం 8.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రాజెక్టులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరిగినా ఉద్యోగాలకు ముప్పు లేదని, ఇది వృద్ధిని మరింత పెంచుతుందని రిపోర్ట్​ వెల్లడించింది. మొత్తం నియామకాలలో 80 శాతం డిమాండ్ ముంబై, ఢిల్లీ వంటి టైర్1 నగరాల నుంచి వస్తోంది. రోడ్లు హైవేలు (26 శాతం), పవర్ ట్రాన్స్​మిషన్ (15 శాతం) రంగాలలో అధిక డిమాండ్ ఉంది.