నర్సరీలో పనిచేసే అర్హులందరికీ EPF : కేటీఆర్

నర్సరీలో పనిచేసే అర్హులందరికీ EPF : కేటీఆర్

అరో విడత హరితహారాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. పట్టణాల్లో మొక్కలు నాటడం తోపాటు వాటిని పెంచడం పైన ఇప్పటికే శాఖ తరఫున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. హైదరాబాద్ ఏరియాలో ఎవరికైనా మొక్కలు కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకోవచ్చన్నారు. హరితహారం లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకు గ్రీనరీ ని కానుకగా అందించాలన్నారు కేటీఆర్.

ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమం లో భాగంగా శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీ లో మొక్కలను పరిశీలించిన మంత్రి కేటీఆర్… నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను అధికారులను  అడిగి తెలుసుకున్నారు. హుడా కాలనీ నర్సరీలోని మొక్కలను పరిశీలించి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా నర్సరీ లో పని చేస్తున్న కార్మికుల యోగక్షేమాలు, జీతం, ఈఏఎస్ఐ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ రావడం లేదని…వచ్చే 10 వేల రూపాయల  జీతం సరిపోవడం లేదని మంత్రికి తెలిపారు కార్మికులు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ అధికారుల తో మాట్లాడి  సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.