లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : ఈక్విటీ సూచీలు సెన్సెక్స్  నిఫ్టీ వరుసగా మూడవ సెషన్‌‌ను లాభాల్లో ముగించాయి. ఇండెక్స్ మేజర్లు ఎల్ అండ్ టీ, ఐటీటీ  మారుతీ షేర్లకు లాభాలు రావడం,  యూఎస్ మార్కెట్లలో రికార్డు ర్యాలీతో శుక్రవారం ఇవి పెరిగాయి. ఎర్లీ ట్రేడింగ్‌‌లో పడిపోయినా తరువాత లేచాయి. 30 షేర్ల బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. అయితే, ఐటీ, టెక్ స్టాక్స్‌‌లో భారీ కరెక్షన్లు సెన్సెక్స్​  వేగాన్ని అడ్డుకున్నాయి. ఇంట్రాడేలో ఇది 474.43 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 73,115.62 వద్దకు చేరుకుంది.

ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,097 వద్దకు చేరుకుంది. ఈవారంలో సెన్సెక్స్​189 పాయింట్లు, నిఫ్టీ 73.4 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌‌లో సన్‌‌ ఫార్మా, మారుతీ, ఇండస్‌‌ఇండ్‌‌ బ్యాంక్‌‌, టైటాన్‌‌, ఐటీసీ, టాటా మోటార్స్‌‌, లార్సెన్‌‌ అండ్‌‌ టూబ్రో, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్‌‌ షేర్లు లాభపడ్డాయి. అయితే ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌‌సిఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా  బజాజ్ ఫిన్‌‌సర్వ్ వెనుకబడి ఉన్నాయి.

బ్రాడ్​ మార్కెట్‌‌లో, బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 1.06 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం పెరిగింది.    ఆసియా మార్కెట్లలో, సియోల్, షాంఘై  హాంకాంగ్ దిగువన స్థిరపడగా, టోక్యో సానుకూలంగా ముగిసింది. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ గురువారం సరికొత్త రికార్డులను తాకింది.