‘తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్న’ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు జర్మనీకి చెందిన న్యాయాధికారులు. 77 ఏడేండ్ల క్రితం నేరం చేసిన ఓ మహిళకు ఇప్పుడు శిక్ష విధించారు. ఎర్గార్డ్ ఫోర్చ్‌నర్ అనే మహిళ తన 18 ఏండ్ల వయసులోనే దాదాపు 10వేల మంది యుద్ధ ఖైదీల మరణ శాసనాన్ని తన చేతుల మీదుగా లిఖించినందుకు ఈ శిక్ష అమలైంది.
1945లో జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో 10,500మంది యుద్ధ ఖైదీల హత్యకు కారణమైన ఇమ్ గార్డ్ ఫోర్చ్ నర్ (97) అనే వృద్ధురాలికి జర్మనీ కోర్టు ఇప్పుడు 2 ఏళ్ల శిక్ష విధించింది. ఫోర్చ్ నర్ నాజీ ఆక్రమిత పోలాండ్ సేనలో టైపిస్ట్ గా పని చేసేది. ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాజీ సేనల చేతుల్లోని కాన్సంట్రేషన్ క్యాంపుల్లో లక్షల మంది యూదులు మరణించారు. ఆ మారణకాండకు ఫోర్చునర్ సహకరించింది. అయితే, నాజీ కాలంలో జరిగిన నేరాలపై జర్మనీ నేటికీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే 2021లో కోర్టుకు హాజరు కావాల్సిన ఫర్చ్ నర్ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తర్వాత హాంబర్గ్ లో పట్టుబడింది. తనను న్యాయస్థానం ముందు హాజరుపరుచగా చేసిన నేరాలను అంగీకరించి కోర్టుని క్షమాపణ కోరింది. న్యాయ విచారణలో నేరం రుజువైన కారణంగా 2 ఏండ్లు శిక్ష విధించింది.
