తొర్రూరు, వెలుగు: కాంగ్రెస్మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మంగళవారం తొర్రూరు బీఆర్ఎస్ ఆఫీస్లో పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న వారికి ఈ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్నెరవేర్చలేదని, బీసీలను మోసం చేసిందని ఆరోపించారు.
