ప్రజలంతా భగీరథ నీటినే తాగాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రజలంతా భగీరథ నీటినే తాగాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

మరిపెడ, వెలుగు : ప్రజలంతా మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ నీటినే తాగాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం పరిధిలోని ఎదుళ్లగుట్ట వద్ద ఉన్న మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఆదివారం నిర్వహించిన నీటి దినోత్సవంలో వారు మాట్లాడారు. మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి కేంద్రం జల జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని, కేంద్రం నుంచి నిధులు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గతంలో గ్రామాలు వెళ్తే బిందెలు అడ్డం పెట్టి నిరసన తెలిపేవారని, మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథతో ఆ సమస్య తీరిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీపీ అరుణ పాల్గొన్నారు. 

ఘనంగా నీటి దినోత్సవం

స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిల్పూరు, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీటి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెన్లను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ పసునూరి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హనుమకొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం.సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.