ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

మన ఊరు-మన బడి కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ(శుక్రవారం) జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో మాట్లాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలకు అవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మన గ్రామాల్లో ఉన్న స్కూళ్లను.. ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్.. బంగారు భారత్ అంటే ఇదేనా?