ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి: ఎర్రబెల్లి

ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే  బీఆర్ఎస్ ఓటమి: ఎర్రబెల్లి

తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్న మాట వాస్తవమన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దళిత బంధు  పథకం ఒక పద్దతిగా ఇస్తే బాగుండేదన్నారు. దళితబందు వల్లే..గిరిజన బంధు, బీసీ బంధు ఇవ్వాలన్న డిమాండ్  ఎక్కువ కావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందన్నారు . మూడేళ్ల కింద ఇండ్ల పంపిణీ చేస్తే బాగుండేదీ...ఎన్నికల ముందు పంపిణీ చేయటం ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసాం....ప్రజలు ఆదరించక పోవడం భాదకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట ద్వారా తాగు నీరుఅందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని చెప్పారు.

పాలకుర్తిలో ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమికి  కారణమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రభుత్వంలో ఉండి ఎనో పనులు చేశాం..  అందరికీ పదవులిచ్చామన్నారు. మానవ సంబంధాలు లేక పోవడం వల్లే ఎర్రబెల్లి  ఓడిపోయారన్నారు. తనపై ప్రత్యర్థి ఎన్ని డబ్బులు పంపిణీ చేసినా ప్రజలు తననే గెలిపించారన్నారు.