- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పర్వతగిరి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో గ్రామాల ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్యనాయకులతో బుధవారం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని, యూరియా కొరతతో రైతులను ఇబ్బందుల పాలు చేసిందన్నారు.
ఎన్నికల్లో విబేధాలు పక్కన పెట్టి అందరినీ కలుపుకుని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, మండలంలోని అన్నారంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొంకపాక నుంచి పలుపార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
