రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదు: ఎర్రబల్లి దయాకర్ రావు

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదు: ఎర్రబల్లి దయాకర్ రావు

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తప్ప వేరే పార్టీలకు మనుగడలేదని అన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు.  జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలను కాపాడుకుంటూనే, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు అండగా… క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీకి ఉన్నారని చెప్పారు. రాష్ట్రం మొత్తంలో పార్టీ సభ్యత్వ నమోదు జనగామ జిల్లాలోనే ఎక్కువగా జరగాలని దయాకర్ రావు చెప్పారు.

వరంగల్ జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తన ద్యేయం అని అన్నారు ఎర్రబల్లి దయాకర్ రావు.  గ్రామ స్థాయి నుంచి పార్టీని కాపాడుకుంటూ.. క్రమశిక్షణ కలిగి ఉండాలని కార్యకర్తలకు సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రణాళిక ప్రకారం, అబివృద్ది చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.