
హైదరాబాద్, వెలుగు: ‘‘మనం ఇతర పనులతో బిజీగా ఉన్నప్పుడు అనుకోకుండా జరిగే సంఘటనలే జీవితం”అని ప్రముఖ సంగీతకారుడు జాన్ లెనన్ అంటారు. ఊహించని పరిస్థితులకు ఎవరూ పూర్తిగా సిద్ధంగా ఉండలేరు, కాబట్టి ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా చాలా అవసరం. వివిధ రకాల జీవిత బీమా పాలసీలలో, ఎండోమెంట్ ప్లాన్లు భారతదేశంలో ఆర్థిక భద్రతకు ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తున్నాయి. ఇవి ఎంత ముఖ్యమో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ కాస్పరస్ క్రోమ్‌హౌట్ వివరించారు. వివరాలన్నీ ఆయన మాటల్లోనే...
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రక్షణకు మాత్రమే పరిమితం. ఎండోమెంట్ ప్లాన్లు కుటుంబానికి ఆదాయం సమకూర్చే వ్యక్తి అకాల మరణం నుంచి ఆర్థిక భద్రతను అందిస్తూనే, పిల్లల విద్య, పెళ్లి, ఇల్లు కొనడం, లేదా రిటైర్మెంట్ వంటి భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం సురక్షితమైన నిధిని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్లాన్లు పెట్టుబడిదారులలో క్రమబద్ధమైన పొదుపు అలవాట్లను పెంపొందిస్తాయి. ఫలితంగా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది.--- ఇవి యులిప్సహా రకరకాల ఆప్షన్లతో వస్తాయి. ఇన్వెస్టర్తనకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు.
ఎండోమెంట్ ప్లాన్లతో ప్రయోజనాలు
పాలసీదారు హఠాత్తుగా మరణిస్తే నామినీకి హామీ మొత్తంతో పాటు బోనస్‌లనూ చెల్లిస్తారు. పాలసీ కాలం ముగిసినప్పుడు, పాలసీదారునికి హామీ ఇచ్చిన మొత్తంతోపాటు బోనస్‌లూ ఇస్తారు. ఈ మొత్తాన్ని వివిధ ఆర్థిక లక్ష్యాల కోసం ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లించడం వల్ల పొదుపు అలవాటుగా మారుతుంది.
బలమైన ఆర్థిక నిధిని నిర్మించడానికి సహాయపడుతుంది. అనేక ఎండోమెంట్ పాలసీలు బీమా సంస్థ పనితీరు ఆధారంగా రివర్షనరీ బోనస్‌లు లేదా టర్మినల్ బోనస్‌లను అందిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ప్రీమియం చెల్లింపులపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
మెచ్యూరిటీ ఆదాయం లేదా డెత్ బెనిఫిట్‌కు సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఎండోమెంట్ ప్లాన్లు అదనపు రక్షణ కోసం వివిధ రైడర్లతో వస్తాయి. వీటిలో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇ ల్‌నెస్ , డిజబిలిటీ రైడర్ వంటివి ఉంటాయి.