
ఒక్క చెట్టును నరికితే ఆరు మొక్కలు నాటి పెంచాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా యాదాద్రి జిల్లా మాసాయిపేటలో పర్యటించారు.;పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాసాయిపేటలో రోడ్డుకు ఇరువైపులా ఒక్క చెట్టు కూడా లేదన్నారు. చెట్లను నరికే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. నాటిన మొక్కలను సంరక్షించకపోతే గ్రామ సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామసేవ చేయని వ్యక్తికి గ్రామంలోని సమస్యల గురించి, ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నించే హక్కు లేదన్నారు.