ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది

ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది

దసరా ఉత్సవ కమిటీల్లో  ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్ జోక్యంపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు సీరియస్ అయ్యారు. ఐదు దశాబ్దాలుగా చేస్తున్న దసరా ఉత్సవ కమిటీలో ఎమ్మెల్యే  జోక్యం సరికాదని ఆరోపించారు. దసరా ఉత్సవ కమిటీకి రాజకీయ రంగు పూయడం ఎమ్మెల్యే  విజ్ఞతకే వదిలేస్తున్నానన్న ఆయన... వరంగల్ తూర్పు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్న ప్రదీప్ రావు... బెంగుళూరు తర్వాత వరంగల్ లోనే దసరా ఉత్సవాలకు  ప్రసిద్ధి అని చెప్పుకొచ్చారు. కమిటీల రూపంలో అధికారం ఉందని ఎమ్మెల్యే తన అనుచరులను చేర్చడం  అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి  ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.  పార్టీల తనకు విలువ లేదని, ఇక పార్టీలో కొనసాగనని అందుకే రాజీనామా చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఇక అప్పట్నుంచి ఎమ్మెల్యే నన్నపనేనికి,  ప్రదీప్ రావుకు మధ్య విబేధాలు తలెత్తడం ప్రారంభించాయి.