
ఈటల పదవికి ఢోకా లేదు
ఈటల అంశం సమసిపోయింది..
నేను కూడా తెలంగాణకు మద్దతుగా లెటరిప్పించా
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో భేటీ అయ్యారు. పార్టీ, ప్రభుత్వ పరమైన అంశాలు… ఈటల రాజేందర్ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. కేటీఆర్ తో భేటీ తర్వాత… మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.
మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. గులాబీ జెండాకు తామూ ఓనర్లమే అని ఇటీవల ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ను తప్పుపట్టారు. ఈటల వ్యవహారం సమసిపోయిందని అన్నారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని చెప్పారు ఎర్రబెల్లి దయాకర్ రావు. గులాబీ జెండాను కేసీఆరే తయారు చేశారని అన్నారు. తాను కూడా టీడీపీలో ఉన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి లెటర్ ఇప్పించినవాన్నే అని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ వివాదం ముగిసిందనీ.. ఆయన పదవికి ఢోకా లేదని చెప్పారు ఎర్రబెల్లి.