డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ జిల్లా: రాయపర్తి మండలం రాయపర్తి, వేంకటేశ్వర పల్లె, కేశవపురం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రాయపపర్తిలో 50, కేశవపురం లో 30, వేంకటేశ్వరపల్లె లో 10 ఇండ్లను ప్రారంభించిన మంత్రి ఆయా ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ..తెలంగాణ లో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలి అన్నదే సీఎం కేసిఆర్ సంకల్పం.. కొంత ఆలస్యంగా అయినప్పటికీ, డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడం ప్రారంభించడం సంతోషంగా ఉంది.. లబ్ధిదారుల తో కలిసి ఇండ్ల ప్రవేశం చేయడం, పాలు పొంగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే ఊపులో మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసిఆర్ లక్ష్యాలకు అనుగుణంగా లబ్దిదారులకు ఇళ్లు కట్టించి అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం బలహీన వర్గాలకు అండగా ఉంటుందని.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్నదని వివరించారు. ప్రజలు కూడా పని చేసే ప్రభుత్వాలకు అండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.