ESI డైరెక్టర్ దేవికా రాణి ఆమె కొడుకు అరెస్ట్

ESI డైరెక్టర్ దేవికా రాణి ఆమె కొడుకు అరెస్ట్

మందుల స్కాం కేసులో ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఆమె కొడుకును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  షేక్ పేట్ లోని తన నివాసం నుండి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. షేక్ పేట్ లోని దేవికా రాణి ఇంట్లో 24 గంటలుగా  ఏసీబీ  సోదాలు కొనసాగుతున్నాయి.సోదాల్లో కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.  దేవికారాని కుమారుడి సంస్థ పేరుతో మెడిసిన్ కొన్నట్టు ఫేక్ బిల్స్ సృష్టించినట్టు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. ఈ కేసులో 17 మంది ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. 10 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు.