హసన్ పర్తి,వెలుగు: ఎస్సార్ ఎడ్యుకేషనల్ ఆకాడమీ తన 50 ఏండ్ల విద్యా ప్రావీణ్య సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, దేశంలోనే ఉత్తమ స్థాయిలో విద్యా నాణ్యతను అందించడమే లక్ష్యంగా సాట్‌క్యూ పరీక్షను నిర్వహిస్తోందని అకాడమీ చైర్మన్ వరదారెడ్డి తెలిపారు.
శుక్రవారం సాట్ క్యూ ఎక్జామ్ బ్రోచర్ ను విడుదల చేశారు. అనంతరం అకాడమీ చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం, ఉన్నత విద్యావకాశాలను విస్తరించడం లక్ష్యంగా ఎస్సార్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక ప్రతిభా పరీక్ష ‘శాట్‌క్యూ’ -ఎస్సార్ అకాడమిక్ ట్యాలెంట్ క్వెస్ట్ ను ఈనెల 2న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 :45 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ఈ పరీక్ష ఇంటర్ లో చేరబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతుందన్నారు. పరీక్షా కేంద్రం హనుమకొండ టీచర్స్కాలనీలోని ఎస్సార్ ఎడ్యుసెంటర్‌లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
