హుజూర్‌‌నగర్‌‌లో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు వరం లాంటిది: అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య

హుజూర్‌‌నగర్‌‌లో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు వరం లాంటిది: అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య
  • ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య

హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అగ్రికల్చరల్ కాలేజ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ లో అగ్రికల్చరల్ కాలేజ్ తాత్కాలిక క్లాసుల నిర్వహణ కోసం భవనాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి హుజూర్ నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కి 30 మందిని  కౌన్సిలింగ్ లో తీసుకొని ప్రస్తుతం రాజేంద్రనగర్ యూనివర్సిటీలో వారికి క్లాసులు  నిర్వహిస్తున్నామన్నారు. మార్చి నెలలో సెమిస్టర్ ముగిసిన వెంటనే ఏప్రిల్ నుంచి ఇక్కడే క్లాసులు ప్రారంభిస్తామని  తెలిపారు. అగ్రికల్చరల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ రెడ్డి, ప్రొఫెసర్లు గోపాల కృష్ణమూర్తి, మధుసూదన్ రెడ్డి,పశ్య శ్రీనివాసరెడ్డి,తన్నీరు మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.