వరంగల్ భద్రకాళి బండ్ పక్కన బీచ్ బాల్ జోన్ 

వరంగల్ భద్రకాళి బండ్ పక్కన బీచ్ బాల్ జోన్ 

 ఇసుకంటే ఇష్టపడని వారెవరుంటారు. ఇక ఆ ఇసుక లో ఆటలంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇసుకలో తనివితీరా ఎంజాయ్ చేయాలన్నా.. ఇసుక మేటల్లో ఆడుకోవాలన్నా గోదావరి తీరానికో లేక సముద్రపు ఒడ్డుకో వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో సముద్రపు ఆనవాళ్లే లేవు. నదుల వద్దకు వెళ్లినా ఆ ఇసుక స్పోర్ట్స్ కు అనుకూలంగా ఉండదు. సో.. ఇసుకలో ఎలాంటి ఆటలు ఆడుకునే అవాకాశం లేదు. ఇసుకలో నిర్వహించే బీచ్ బాల్, ఇతర ఆటలు ఎలాంటివి ఆడుకోవాలనుకున్నా.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిందే. ఐతే ఇసుకలో ఎంజాయ్ చేయాలనుకునే వారి కోరికను తీర్చేందుకు కొందరు వరంగల్ యువకులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. వరంగల్- హన్మకొండ జంట నగరాల మధ్య భద్రకాళి బండ్ పక్కన బీచ్ బాల్ జోన్ ఏర్పాటు చేశారు. ఒకవైపు భద్రకాళి సరస్సు - మరోవైపు భద్రకాళి బండ్ ఆ పక్కనే బీచ్ బాల్ జోన్. ఇంకేముంది బీచ్ బాల్ ఆడాలని కళలుగనే వారు ఇక్కడ వారి కోరిక తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా సముద్ర ప్రాంతం నుంచి ఈ ఇసుకను తెప్పించి ఇండోర్ లో తయారుచేశారు. ఇది పిల్లలు, పెద్దలు.. అందరినీ ఆకట్టుకుంటోంది.  

గత రెండేళ్లుగా కరోనా ప్రభావం జనంపై తీవ్రంగా ఉంది. లాక్ డౌన్  సమయంలో పూర్తిగా ఇళ్లకే పరిమితయ్యారు.  టీవీలు.. ఓటీటీలలో సినిమాలు.. సెల్ ఫోన్లలో ఆన్ లైన్ గేమ్స్  కు పరిమితయ్యారు. కరోనా సెకెండ్ వేవ్ నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్నారు. కామన్ లైఫ్ కు అలవాటుపడుతున్నారు. వరంగల్ లో ఈవీనింగ్ లేదా వీకెండ్స్ వెళ్లాలంటే భద్రకాళీ గుడి, ఫోర్ట్ వరంగల్, వేయిస్తంబాల గుడి, పబ్లిక్ గార్డెన్ లాంటివి తప్ప పెద్దగా చెప్పుకునేవి లేవు. ఈ క్రమంలో కొత్తదనం కోరుకునే వారిని ఈ బీచ్ వాలీ బాల్ ఆకట్టుకుంటోంది. వీకెండ్ వస్తే చాలు ఇలా వచ్చి కొద్దిసేపు సేదతీరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రెడీమేడ్ బీచ్ లో చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలసట తెలియకుండా ఆడే ఇలాంటి క్రీడలు ఒంటికి మంచి వ్యాయామంలా ఉపయోగ పడతాయంటున్నారు. 

వాలీబాల్ తోపాటు... పక్కనే ఎర్పాటు చేసిన పుట్ బాల్ కు మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండెండ్స్ తో అందంగా ఎర్పాటు చేశారు. ఫుట్ బాల్ తొ పాటు పిల్లల కోసం క్రికెట్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకునేలా రూపొందించారు. పిల్లలు ..పెద్దలు తాము ఆటలతో ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు. చాలా రోజులుగా ఇంటికే పరమితమైన తాము ఇక్కడ హ్యాపీగా గడుపుతున్నామని అంటున్నారు. 

ప్రజలను ఆకట్టుకునేలా డిఫరెంట్ గా ఉండాలని, వరంగల్ వాసులను స్పెషల్ గా ఉండాలనే ఆలోచనతోనే బీచ్ వాలీబాల్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఐతే సముద్ర తీరం నుంచి ఇసుకను ఇక్కడకు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అంటున్నారు.