మెడికల్ కాలీజీల ఏర్పాటులో తెలంగాణకు కేంద్రం మొండి చేయి

మెడికల్ కాలీజీల ఏర్పాటులో తెలంగాణకు కేంద్రం మొండి చేయి

జగిత్యాల జిల్లా: దేశంలో 158 మెడికల్ కాలేజీలిచ్చిన కేంద్రం... తెలంగాణాకు మాత్రం మొండిచేయి చూపిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయి.. ఇద్దరు ఎంపీలు బండి సంజయ్, అరవింద్ గెలవడం మన దురదృష్టం అన్నారు.  వాళ్ళు చేయలేని పనిని.. మళ్ళీ ముఖ్యమంత్రే చేశారని తెలిపారు. ఆయన పుణ్యం వల్లే జగిత్యాలకు మెడికల్ కళాశాల దక్కిందని..మెడికల్ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పినట్టు.. యాభై ఎకరాలుండాల్సిందేనన్నది సరికాదని... సిద్ధిపేటలో 20 ఎకరాల్లోనే పెట్టారన్నారు. జగిత్యాల పట్టణానికి, బస్టాండ్ కు నడిచిపోయి రావడానికి అనుకూలంగా ఉండే చోటు కాబట్టే ధరూర్ ను మెడికల్ కళాశాల నిర్మాణం కోసం ఎంచుకున్నామన్నారు.  చల్గల్ లో పండ్ల మార్కెట్ కడుతామన్న ఆయన.. అక్కడ గోదాముల నిర్మాణం జరుగుతదన్నారు. గోదాములున్న చోట లక్కపురుగులవంటివి ఉంటాయి కాబట్టి హాస్పిటల్ నిర్మాణం సరికాదన్నారు. 

మెడికల్ కళాశాల వచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు కానీ.. జీవన్ రెడ్డే పదే పదే ఉత్తరాలు రాస్తున్నారన్నారు.  ధరూర్ లోగానీ.. చల్గల్ లోగానీ పెట్టాలని ముందు కోరింది జీవన్ రెడ్డేనని కానీ.. ఆయనే ఇప్పుడు ధరూర్ లో మళ్ళీ వద్దని ఉత్తరాలు రాస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం జీవన్ రెడ్డి ఆరాటపడుతున్నారని.. ఏదైనా ఒక వివాదం సృష్టించి మెడికల్ కళాశాలను ఇంకొద్దికాలం ఆపాలన్నదే జీవన్ రెడ్డి ఆలోచన అన్నారు. ఎందుకంటే మాకు పేరెక్కడ వస్తదోననే ఆయన ఆందోళన చెందుతున్నారని తెలిపారు. న్యాక్ సెంటర్ నీ, జేఎన్టీయూ కళాశాలని ఎక్కడో గుట్టల్లల్లో పెట్టిన ఘనత జీవన్ రెడ్డీదన్నారు. వాటికి వెళ్లే విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని..మూడు నెలల్లో మూడువందల పడకల ఆసుపత్రిని అత్యంత వేగంగా జగిత్యాల్లో కట్టబోతున్నామని తెలిపారు. ఇది జగిత్యాల జిల్లా ప్రజలకు శుభవార్త అని.. మెడికల్ కళాశాల, హాస్పిటల్ ఒక్క చోట ఉండేందుకే ధరూర్ ను ఎంపిక చేశామన్నారు. ఇక్కడి గోడౌన్స్ ను షిఫ్ట్ చేయడానికి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని..జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దీన్ని రాజకీయం చేయొద్దని కోరుతున్నా అన్నారు.