హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: జమునా హేచరీస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు చెందిన వివాదాస్పద 3 ఎకరాల భూమి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. మెదక్‌‌ జిల్లా మాసాయిపేట్‌‌ ఎమ్మార్వో జారీ చేసిన నోటీసులను సవాల్‌‌ చేస్తూ జమునా హేచరీస్‌‌తోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ భార్య జమున, కుమారుడు నితిన్‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌‌ ఎం.సుధీర్‌‌కుమార్‌‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మాసాయిపేట్‌‌ మండలం అచ్చంపేట్‌‌ గ్రామంలోని సర్వే నంబర్130లోని భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. సర్వే నెం. 130లో 18.35 ఎకరాలు ఉంటే మూడెకరాల విషయంలోనే పిటిషనర్లు హైకోర్టులో సవాల్‌‌ చేశారని జడ్జి చెప్పారు. పిటిషనర్ల వాదనలు వినకుండా ఆక్రమణలపై తహసీల్దార్‌‌ చర్యలు తీసుకోవడం కరెక్ట్​ కాదన్నారు.