కేసీఆర్ సవాలును స్వీకరించే గజ్వేల్ కి వచ్చా: ఈటల రాజేందర్ 

కేసీఆర్ సవాలును స్వీకరించే గజ్వేల్ కి వచ్చా: ఈటల రాజేందర్ 

గజ్వేల్​/జగదేవపూర్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటకు తీస్తామని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, బీజేపీ గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం  జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీస్, అధికార యంత్రాంగ బలం, వేల కోట్లతో నన్ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారన్నారు. అయినప్పటికీ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు.

ధర్మాన్ని, న్యాయాన్ని, శ్రమను నమ్ముకున్నాను కాబట్టే 20 ఏళ్లుగా ఓటమి ఎరగకుండా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నానన్నారు. కేసీఆర్​ 9ఏళ్లుగా గజ్వేల్ ప్రజలకు, నాయకులకు ముఖం చూపించకుండా ప్రగతిభవన్ , ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని ఆరోపించారు. -కేసీఆర్ సవాలును స్వీకరించే గజ్వేల్ కి వచ్చానని తెలిపారు. వందమంది జేజమ్మలు దిగివచ్చిన గజ్వేల్ లో ఈటలను ఓడించలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రమేశ్​, రమేశ్​యాదవ్​, శ్రీకాంత్​, ఎల్లు రాంరెడ్డి, ప్రసాద్ రావు, గురువారెడ్డి, శ్రీధర్, రాములు, కృష్ణమూర్తి, చంద్రబోస్, గణే‌శ్​, హేమ, శ్రీనివాస్ ఉన్నారు.