కాన్వాయ్ ని ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఈటల

V6 Velugu Posted on May 03, 2021

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన కాన్వాయ్ ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు కాన్వాయ్‌ని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు. మెదక్‌ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేశారు.

 


 

Tagged Telangana government, Etala Rajender, etela rajender convoy

Latest Videos

Subscribe Now

More News