అన్ని కులాల్లోని పేదలందరికీ 10 లక్షలు ఇవ్వాలి

V6 Velugu Posted on Sep 15, 2021

తన  రాజీనామా వల్లే హుజురాబాద్ లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. ఫించన్లు, గొర్రెలు, రేషన్ కార్డులు, దళితబంధు అన్నీ హుజురాబాద్ కే ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు అందాలంటే 2 లక్షల కోట్లు కావాలని.... అంత డబ్బులు ఖర్చు చేయాలంటే 40 ఏళ్లు పడుతుందన్నారు. అన్ని కులాల్లోని పేదలందరికీ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. పలువురు ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. 

Tagged 10 lakh, etela demanded, poor , all castes

Latest Videos

Subscribe Now

More News