
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ నుంచి ఇల్లందకుంట వరకు పాదయాత్ర నిర్వహించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభిమానులు. పాదయాత్ర చేస్తూ అస్వస్తతకు గురైన ఈటల త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. కమలాపూర్ లోని రామాలయం నుంచి ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది.