వ్యాక్సిన్ పై భయం వద్దు: రేపే ఫస్ట్ డోస్

వ్యాక్సిన్ పై భయం వద్దు: రేపే ఫస్ట్ డోస్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రేపు 139 సెంటర్లతో 4 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు.  రేపు ఫస్ట్ డోస్..28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఉంటుందని..ఫస్ట్ డోస్ ఏ కంపెనీదో.. సెకండ్ డోస్ అదే కంపెనీది వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై చాలా మందికి డౌట్లు ఉన్నాయని.. సీరమ్, భారత్ 3 ట్రయల్స్ తర్వాతే అనుమతి వచ్చిందన్నారు. వారంలో 4 రోజులు వ్యాక్సిన్ ఉంటుందని.. సోమ, మంగళ, గురు, శని వారాల్లో ఉంటుందన్నారు. శానిటేషన్, సెక్యురిటి, నర్సులు, డాక్టర్లు, ఉన్నతాధికారులు వ్యాక్సిన్ తీసుకుంటారని..భారత ప్రభుత్వం, ఐసీఎమ్ఆర్ ప్రోటోకాల్ ప్రకారమే వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందన్నారు.

మన దగ్గర రోజుకు లక్ష మందికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం ఉందని..వ్యాక్సిన్ గురించి భయపడొద్దన్నారు. వేల కోట్ల రూపాయలు వ్యాక్సిన్ తయారీకి ఖర్చు చేశారని..ట్రయిల్స్ రిజల్ట్ చూశాకనే డీసీజీఐ అనుమతులిచ్చిందన్నారు. సెకండ్ ట్రయిల్స్ లోనే అన్ని రియాక్షన్స్ తెలుస్తాయని.. భారత్ బయోటెక్ మూడో ఫేజ్ లో ఉందని భయం అవసరం లేదన్నారు. రేపు ప్రారంభమయ్యే వ్యాక్సిన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. ICMR గైడ్ లైన్స్ చెప్పే వరకూ.. ప్రెగ్నెంట్ ఉమెన్ కు, 18 ఈయర్స్ లోపు వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వమని తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.