జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావు: ఈటెల

జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావు: ఈటెల

రాష్ట్రంలో జ్వరాలన్నీ కూడా డెంగీ, మలేరియా జ్వరాలు కావన్నారు మంత్రి ఈటెల  రాజెందర్. ప్రభుత్వాస్పత్రుల్లో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామో ప్రతిపక్షాలు ఒకసారి వెళ్లి పరిశీలించాలన్నారు. అసెంబ్లీలో  జ్వరాల సంగతేంటని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నకు ఈటెల మాట్లాడుతూ.. ఇవాళ ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం వచ్చిందన్నారు. రాష్ట్రంలో .ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. గర్భిణీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.  2017లో ఉన్న డెంగీ వైరస్ తీవ్రత  ఇప్పుడు లేదన్నారు. రాష్ట్రంలో డెంగీ కేసులున్నాయి కానీ మరణాలు ఎక్కువ మోతాదులో  లేవన్నారు. జ్వరాలు వస్తున్నందున డాక్టర్లు, వైద్యాధికారుల సెలవులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో 17 వేల బెడ్లుంటే వాటిని 22 వేలకు పెంచింది  టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.  గ్రామాల్లో పారిశుద్ధ్యంపై సీఎం కేసీఆర్ రూ.330 కోట్లు రిలీజ్ చేసి 30 రోజుల ప్రణాళిక నిర్వహిస్తున్నామన్నారు.